సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి: DMHO

సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి: DMHO

MNCL: సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని మంచిర్యాల జిల్లా వైద్యాధికారి అనిత బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. ఆశ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి సేవలందించడంలో ముందుండాలని, ప్రతీ గర్భిణి వివరాలు నమోదు చేయాలని తెలిపారు. టీకాలు ఇప్పించడం, ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవం అయ్యేలా చూడాలని పేర్కొన్నారు. ప్రజలకు వ్యాధులపై అవగా హన కల్పించాలని తెలిపారు.