దుబాయ్ నుంచి ఢిల్లీ చేరుకున్న తొలి విమానం
గల్ఫ్ దేశాల నుంచి విమాన రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా దుబాయ్ నుంచి 149 మందితో తొలి విమానం ఢిల్లీకి చేరుకుంది. దుబాయ్, అబుదాబి, మస్కట్ నుంచి భారత్‌కు విమానసేవలు ప్రారంభమయ్యాయి. మస్కట్, అబుదాబి నుంచి 2 విమానాలు ఢిల్లీ చేరుకున్నాయి. కాగా, పశ్చిమాసియా దేశాల మధ్య యుద్ధం జరుగుతోన్న నేపథ్యంలో పలు దేశాల్లో విమానసేవలు తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే.