వారంలో 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్!
త్వరలో దేశంలోని 4 రాష్ట్రాలకు, ఓ కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికల నగరా మోగనుంది. అసోం, కేరళ, తమిళనాడు, బెంగాల్‌తో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. వచ్చే వారంలో ఈసీ షెడ్యూల్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు, బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించనున్నట్లు సమాచారం.