ఘనంగా ధనుర్మాస మహోత్సవాలు ప్రారంభం
VSP: శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి సన్నిధిలో మంగళవారం ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 1:01 గంటలకు శాస్త్రోక్తంగా నిర్వహించిన ‘నెలగంట’ ఉత్సవంతో ఆలయం భక్తి వాతావరణంతో నిండింది. వేదమంత్రాల నడుమ జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.