నవీపేటలో తప్పిపోయిన బాలిక లభ్యం

నవీపేటలో తప్పిపోయిన బాలిక లభ్యం

NZB: నవీపేట మండలం ఫకీరాబాద్లో ఒంటరిగా ఏడుస్తూ తిరుగుతున్న ఓ చిన్నారిని స్థానికులు గమనించి పోలీసులకు అప్పగించారు. విచారణలో ఆ బాలిక తనది బోధన్ అని చెబుతోంది. ప్రస్తుతం చిన్నారి నవీపేట పోలీసుల సంరక్షణలో క్షేమంగా ఉంది. ఈ బాలికను గుర్తించిన వారు లేదా కుటుంబ సభ్యుల సమాచారం తెలిసిన వారు వెంటనే 9441538507 నంబరుకు సంప్రదించాలని పోలీసులు కోరారు.