VIDEO: వైభవంగా వేలాల గట్టు మల్లన్న గిరి ప్రదక్షిణ
MNCL: జైపూర్ మండలంలోని వేలాల గ్రామంలో గట్టు మల్లన్న గుట్ట మీద ఆదివారం చిలుకూరి బాలాజీ శివాలయం ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మరాం మహారాజ్ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ వైభవోపేతంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అత్యంత భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణ చేశారు. భక్తుల శివనామస్మరణతో గుట్ట పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.