'రాజు వెడ్స్ రాంబాయి'ని మిస్ చేసుకున్న హీరోలు!
యువ నటుడు అఖిల్ రాజ్, తేజస్విని జంటగా దర్శకుడు సాయిలు కంపాటి తెరకెక్కించిన సినిమా 'రాజు వెడ్స్ రాంబాయి'. చిన్న మూవీగా రిలీజై సూపర్ హిట్ అందుకుంది. అయితే ఈ సినిమాను నలుగురు హీరోలు వదులుకున్నట్లు సాయిలు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. రాహుల్ రామకృష్ణ, సుమంత్ ప్రభాస్, విరాట్ కర్ణ, యాంకర్ సుమ తనయుడు రోషన్‌లకు కథను చెప్పగా.. వారు నో చెప్పారని తెలిపాడు.