సురవరం సుధాకర్ రెడ్డికి ఎమ్మెల్యే బాలూ నాయక్ నివాళి

NLG: సీపీఐ అగ్రనేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి భౌతికకాయానికి ఎమ్మెల్యే బాలూనాయక్ పూలమాల వేసి నివాళులర్పించారు. సుధాకర్ ఎంపీగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. తన జీవితాన్ని, దేహాన్ని ప్రజాసేవకే అంకితం చేసిన గొప్ప మహానుభావుడని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరారు.