జ్యోతికి ఉద్యోగం కల్పించిన కలెక్టర్
GNTR: అంధత్వంతో బాధపడుతూ కుమారుడిని పోషిస్తున్న జ్యోతికి ఉద్యోగ కల్పన జరిగింది. పాతగుంటూరులో నివాసం ఉంటున్న జ్యోతి గాధ మంత్రి నారా లోకేశ్‌కి తెలియడంతో ఆయన స్పందించారు. ఈ మేరకు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పారిశుద్ద్య విభాగంలో ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ కల్పన చేస్తూ జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా శనివారం తన కార్యాలయంలో నియామక పత్రాన్ని అందజేశారు.