అత్యవసర వాహనాల ఆకస్మిక తనిఖీ

అత్యవసర వాహనాల ఆకస్మిక తనిఖీ

MHBD: మరిపెడ మండలకేంద్రంలోని 108, 102 అత్యవసర వాహనాలను శుక్రవారం మహబూబాబాద్ జిల్లా మేనేజర్ బత్తిని మహేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వాహనాల్లోని వైద్య పరికరాలను, వాటి పనితీరును పరిశీలించారు. ప్రజలకు అందిస్తున్న సేవల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో 108 సిబ్బంది అనుములరమణ, ప్రవీణ్, 102 కెప్టెన్ బండపల్లి రవి పాల్గొన్నారు.