మెయిన్ రోడ్డు విస్తరణకై అధికారుల పరిశీలన

RR: షాద్ నగర్ పట్టణంలో మెయిన్ రోడ్డు విస్తరణకు సంబంధించిన చర్యలు వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం మున్సిపల్ కమిషనర్ సునీత, హెచ్ఎండీఏ అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆదేశాల మేరకు అధికారులు సమగ్రంగా పరిశీలించి రోడ్డు విస్తరణకు అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.