'దాతల సహకారం మరువలేనిది'
BDK: విద్యార్థుల చదువులను ప్రోత్సహించేందుకు ముందుకు వస్తున్న దాతల సహకారం మరువలేనిదని వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్ధి నిలయం అద్యక్షులు తాటి పాపారావు అన్నారు. చింతకుంట గ్రామానికి చెందిన రైతు కొత్తపల్లి వెంకట్రావు - వీరాజమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు, కోడలు కొత్తపల్లి సుభాష్ చంద్రబోస్ - నాగమణి దంపతులు 50 కేజీల బియ్యం, సరుకులు ఇవాళ అందజేశారు.