VIDEO: రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు
నల్గొండ జిల్లా మిర్యాలగూడ డీఎస్పీ కార్యాలయంలో స్కూల్ బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాజశేఖర్ రాజు మాట్లాడుతూ.. నిబంధనలు పాటించని స్కూల్ బస్సు డ్రైవర్లతో పాటు యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. స్కూల్ విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టి బస్సులను నడిపితే సహించబోమన్నారు.