పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: డీఈవో
BPT: ఏపీఆర్ఎస్ కాట్, ఎపీఆర్‌జేసీ, డీసీ సెట్ పరీక్షలను ఈ నెల 24న నిర్వహిస్తున్నట్లు డీఈవో శ్రీనివాస సింగ్ తెలిపారు. ఆయన గురువారం మాట్లాడుతూ బాపట్ల పబ్లిక్ స్కూల్‌లో నిర్వహించే ఏపీఆర్ఎస్ కాట్ పరీక్షకు 139, పురపాలక ఉన్నత పాఠశాల, బాపట్ల పబ్లిక్ స్కూల్, సరస్వతీ స్మారక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల కేంద్రాలలో నిర్వహించే పరీక్షకు 525 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.