గల్లంతైన మరో ఇద్దరి మృతదేహాలు లభ్యం
ELR: గోదావరిలో నిన్న ఐదుగురు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. గజ ఈతగాళ్లు, సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి ముగ్గురి మృతదేహాలు వెలికితీశారు. ఇవాళ ఉదయం మరో ఇద్దరి (సతీష్, తేజ) మృతదేహాలు వెలికితీసినట్లు తెలిపారు. అధికారులు వారి మృతదేహాలను వారి వారి స్వగ్రామానికి చేర్చేందుకు సన్నహకాలు చేస్తున్నారు. వీరి మృతితో గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.