కూతురికి ఉపాసన ఏం తినిపిస్తుందంటే..?

మెగా ప్రిన్సెస్ క్లీంకారకు సంబంధించిన ఏ విషయమైనా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలుస్తుంటుంది. ఈ సారి తన బుజ్జాయి తీసుకునే ఆహారం గురించిన ఓ ఆసక్తికర విషయాన్ని ఉపాసన బయటపెట్టింది. తన కూతురికి రాగులు అలవాటు చేసినట్లు చెప్పింది. తన కూతురికి రాగులు తినిపించాలని సద్గురు జగ్గీ వాసుదేవ్ చెప్పారని తెలిపింది. క్లింకార హెల్దీగా, ఫిట్‌గా ఉండాలనేదే తన కోరిక అని పేర్కొంది.