పెళ్లయిన 10 రోజులకే యువతి అదృశ్యం

పెళ్లయిన 10 రోజులకే యువతి అదృశ్యం

CTR: బైరెడ్డిపల్లి మండలం గంగినాయినిపల్లి, కొత్తిండ్లు గ్రామంలో పెళ్లయిన 10 రోజులకే ఒక యువతి అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది. బైరెడ్డిపల్లి పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మంజమ్మ కుమార్తె లక్ష్మీ దేవి (20) ఈ నెల 26వ తేదీ నుంచి కనిపించడం లేదని తెలిపారు. ఈమెకు పెళ్లయి కేవలం 10 రోజులే అయినట్లు పోలీసులు తెలిపారు. మంజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.