VIDEO: పుష్కర ఘాట్ వరద ఉధృతిని పరిశీలించిన కలెక్టర్

BHPL: మహదేవపూర్ మండలం కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ద వరద ఉధృతిని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖారే బుధవారం పరిశీలించారు. 24 గంటలు నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. గోదావరిలో వరద పెరుగుతుండటంతో నది ఒడ్డున ఇళ్లను ఖాళీ చేసి, ప్రజలను సురక్షిత కేంద్రాలకు తరలించాలని, ముంపు ప్రాంతాలను పరిశీలించి నివేదికలు సమర్పించాలని సూచించారు.