'జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి దరఖాస్తు చేసుకోవాలి'

NLG: జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి అర్హత ఉన్న వారందరూ దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కుటుంబ పెద్ద మరణించిన సందర్భంలో కేంద్రం ద్వారా అమలు చేసే ఈ పథకం కింద ఒకేసారి రూ.20 వేల ఆర్థిక సహాయం అందుతుందని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆసరా పెన్షన్ పొందుతున్నప్పటికీ ఈ పథకానికి అర్హులేనని అన్నారు.