తిరుమల క్యూలైన్లలో VR టెక్నాలజీ

తిరుమల క్యూలైన్లలో VR టెక్నాలజీ

AP: శ్రీవారి భక్తులకు మెరుగైన ఆధ్యాత్మిక అనుభూతి పంచేందుకు TTD సరికొత్త ఆలోచన చేసింది. క్యూలైన్లలో భక్తులకు సాంత్వన కలిగించడంతోపాటు వారి దృష్టిని ఆధ్యాత్మికత వైపు మళ్లేలా వర్చువల్ రియాలిటీ(VR) టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా భక్తులు శ్రీవారి వైభవం, క్షేత్ర విశేషాలు, ఇతర పవిత్ర దశ్యాలను వీక్షించవచ్చు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రాథమిక దశలో ఉంది.