VIDEO: రేపాకలో బావిలో పడి వ్యక్తి మృతి..

VIDEO: రేపాకలో బావిలో పడి వ్యక్తి మృతి..

BHPL: రేగొండ మండలం రేపాక గ్రామంలో శుక్రవారం సాయంత్రం లక్ష్మీరాజం అనే వ్యక్తి బావిలో పడి మృతి చెందాడు. ఆయన కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టగా, వ్యవసాయ బావి దగ్గర చెప్పులు కనిపించాయి. గ్రామస్థులు బావిలో వెతకగా, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.