భారీ వర్షాలు.. నీట మునిగిన మెట్రో స్టేషన్

ముంబై నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత 24 గంటల్లో కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు నదులను తలపిస్తున్నాయి. ఈ వరదల కారణంగా ఇటీవల ప్రారంభించిన వర్లి భూగర్భ మెట్రో స్టేషన్ ఆక్వా లైన్ 3 నీట మునిగింది. దీంతో మెట్రోలో ప్రయాణిస్తున్న వారు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్ వైరల్ అవుతోంది.