ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తాం: ఎస్పి
BDK: జిల్లాలో రహదారి భద్రతను అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకొని పోలీసు శాఖ అన్ని విభాగాలతో సమన్వయంతో చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ప్రమాదాలకు ప్రధాన కారణాలైన అధిక వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం లోపించడం వంటి అంశాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పారు.