రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్
అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో ఈనెల 23న ఉదయం 9 గంటల నుంచి 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక', 'రెవెన్యూ క్లినిక్' నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. అర్జీదారులు తమ సమస్యలపై ఫిర్యాదులు అందజేయవచ్చని, పాత దరఖాస్తుల వివరాల కోసం '1100' కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు.