కళ్యానోత్సవానికి ముస్తాబైన మిథులా మండపం
BDK: శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి ఆలయంలో నేడు సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా జరగనుంది. ఆలయ వెలుపల ఉన్న మిథిలా మండపం సుందరంగా ముస్తాబైంది. ఇలాంటి లోక కళ్యాణం జరిగే మండపంలో ప్రతి భాగం ఒక కళాఖండమే. ప్రస్తుతం ఈ మండపం చూపరులకు చూపును కట్టిపడేస్తుంది. అయితే, భక్తుల సౌకర్యార్థం CM రేవంత్ మండపం వద్ద సెక్టార్‌లో 50 టన్నుల ACని ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ తెలిపింది.