రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
TPT: సూళ్లూరుపేట మండలం పిండుపాలెం వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వాకాడు మండలం వల్లమేడుకు చెందిన మునస్వామి(45) రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడటంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.