ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
KRNL: క్రిష్ణగిరి శివారులోని మోడల్ స్కూల్, జూనియర్ కాలేజీలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ నిర్మల కుమారి తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో సీట్లు ఉన్నాయని చెప్పారు. వచ్చే నెల 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు కళాశాల ఆఫీసును సంప్రదించాలని చెప్పారు.