కాంగ్రెస్ పార్టీలో చేరిన సర్పంచ్
NGKL: వెల్దండ మండలంలోని నగారగడ్డ తండా సర్పంచ్ శారద శనివారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సర్పంచ్‌కు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తండాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు పూర్తి సహకారం అందిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.