VIDEO: హరే కృష్ణ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
SKLM: నరసన్నపేట పట్టణంలో హరే కృష్ణ ప్రచార కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక ఇందిరానగర్ పార్కులో నిర్వహించిన హరే కృష్ణ ఉత్సవంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ముఖ్యఅతిథిగా ఇవాళ రాత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధా సమేత శ్రీ కృష్ణ విగ్రహాలకు పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన భజనలో పాల్గొని భక్తి పాటలు ఆలపించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.