ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మున్సిపల్ కమిషనర్
MHBD: తుఫాన్ కారణంగా తొర్రూరు పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్ సూచించారు. శిధిలమైన ఇళ్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని కోరారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే వెంటనే కంట్రోల్ రూమ్ నెంబర్లు 9010816965, 9848443602కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.