VIDEO: యుద్ధం ఎఫెక్ట్.. పెట్రోల్ బంక్ వద్ద క్యూ కట్టిన వాహనాలు
KKD: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పెట్రోల్ సంక్షోభం కలుగుతున్నాయని పుకార్లు షికార్లు చేయడంతో ఏలేశ్వరంలో పెట్రోల్ బంకు వద్ద ద్విచక్ర వాహనాలు బారులు తీరాయి. పుకార్లకు అనుగుణంగా స్థానికంగా ఉండే బంకులలో పెట్రోల్ లేకపోవడంతో ఈ పుకార్ల వ్యవహారం మరింత ముదిరింది. దీంతో ద్విచక్ర వాహనాలు అన్ని స్థానిక సీవోఎం చర్చి ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ వైపు పరుగులు తీసాయి.