200 కిలోల గంజాయి పట్టివేత

200 కిలోల గంజాయి పట్టివేత

BDK: భద్రాచలం పోలీసులు నిన్న దాదాపు 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వాహనాల తనిఖీలో భాగంగా అనుమానాస్పదంగా కనిపించిన ట్రాలీ ఆటోను ఆపి తనిఖీ చేయగా, అందులో పొట్లాలలో ఉన్న గంజాయిని గుర్తించారు. దీని విలువ సుమారు 50 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.