జిల్లాలో విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
WNP: జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగి, ఎండలు దంచి కొడుతున్నాయి. గడచిన 24 గంటలో అత్యధికంగా వీపనగండ్ల మండల కేంద్రంలో 41.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దగడ 41.4°C, పెద్దమందడి, పానగల్ 41.1°C, శ్రీరంగాపూర్ 40.9°C, రేవల్లి 40.7°C, వెల్గొండ, ఆత్మకూర్, వనపర్తి 40.5°C, జనంపేట, పెబ్బేరు 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.