VIDEO: అత్తాపూర్‌లో 'ధురంధర్' సెకండ్ షో లో ఉద్రిక్తత
HYD: అత్తాపూర్‌లోని ఒక సినిమా హాల్లో 'ధురంధర్' సెకండ్ షో ప్రదర్శన సమయంలో ఉద్రిక్తత నెలకొంది. సీటును కాళ్లతో తాకుతున్నారనే చిన్న కారణంతో రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్తా భౌతిక దాడికి దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా వారు దురుసుగా ప్రవర్తించారు. చివరకు వారిని శాంతింపజేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.