'ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలి'

'ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలి'

ADB: ఎన్నిక సమయంలో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని తాంసీ మండల బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తాంసీ మండలంలోని బస్టాండ్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని నిరసన వ్యక్తం చేశారు.