రూ.27 లక్షలతో సిసి రోడ్లకు శంకుస్థాపన

BDK: మణుగూరు మున్సిపాలిటీలోని గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ఆదర్శనగర్ వరకు రూ.27 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్ల నిర్మాణ పనులకు శుక్రవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శంకుస్థాపన చేశారు. రహదారి అభివృద్ధి ద్వారా ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో ఈ పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు.