ఈనెల 29న ఏకలవ్య పాఠశాల ప్రవేశ పరీక్ష
ADB: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాల కోసం ఈనెల 29న నిర్వహించే పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రిన్సిపల్ అరవింద్ తెలిపారు. ఉట్నూర్ కేంద్రంలో మొత్తం 624 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని పేర్కొన్నారు. అభ్యర్థులు వెంటనే హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని, సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.