'ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు సహకరించాలి'
MLG: గ్రామ పంచాయతీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకారం అందించాలని ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. తన చాంబర్‌లో వివిధ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తప్పక పాటించాలని కలెక్టర్ సూచించారు. ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని ఆయన కోరారు.