VIDEO: వైభవంగా రాజరాజేశ్వర స్వామి వారి పల్లకి సేవ
JGL: పెగడపల్లి మండల కేంద్రంలోని స్వయంభు రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పార్వతీ పరమేశ్వరుల పల్లకి సేవ సోమవారం అత్యంత వైభవపేతంగా జరిగింది. రంగురంగుల పూలతో అలంకరించిన పల్లకిలో స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను ప్రతిష్టించి ఊరేగింపు చేశారు. భక్తులు ఉత్సాహంగా పల్లకి సేవలలో భక్తిశ్రద్ధలతో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.