చొక్కా విప్పి తలకు చుట్టుకుని ప్రయాణం
VKB: తీవ్ర ఎండల వేడిమికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో బయటకు వెళ్లేవారు తలనొప్పి, అలసటతో బాధపడుతున్నారు. ఈ వేడిమిని తట్టుకోలేక ఓ వ్యక్తి తన చొక్కాను విప్పి తలకు కట్టుకుని ప్రయాణించారు. రోడ్లపై ఎండ తాపం నుంచి రక్షణ పొందేందుకు వినూత్నంగా ప్రయత్నించడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.