జీబీసీ రోడ్డు పై వాహనాలు తనిఖీ..

గుంటూరు: పొన్నూరు మండలం ములుకుదురు గ్రామ శివారు నండూరు అడ్‌రొడ్డ్ వద్ద శుక్రవారం పొన్నూరు రూరల్ పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టారు. అనుమానాస్పద వాహనాలు ఆపి తనిఖీలు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అక్రమ మద్యం, నగదు తరలిపోకుండా కట్టుదిట్టమైన తనిఖీ చేస్తున్నట్లు రూరల్ ఎస్సై తెలిపారు.