330మందికి షోకాజ్ నోటీసులు

ప్రకాశం: జిల్లా ప్రభుత్వ వైద్యశాలల్లో ఫేషియల్ యాప్‌లో హాజరు సక్రమంగా నమోదు చేయని 330మంది వైద్యులు, సిబ్బందికి ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేశారు. విధులకు సక్రమంగా హాజరుకాకుండా యాప్‌లో తప్పుడు హాజరు నమోదు చేసిన 121 మంది వైద్యులతో పాటు ఇతర సిబ్బందికి కూడా నోటీసులు అందాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నారు.