సబ్సిడీ వాహనాలను పంపిణీ చేసిన మంత్రి

సబ్సిడీ వాహనాలను పంపిణీ చేసిన మంత్రి

అన్నమయ్య: రాయచోటి పట్టణంలో మంగళవారం రవాణా అధికారుల సమక్షంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లబ్ధిదారులకు సబ్సిడీపై కొనుగోలు చేసిన వాహనాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తున్నామని, ఈ పథకాలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి, ఆర్థికంగా బలోపేతం చేస్తాయని మంత్రి తెలిపారు.