'ప్రభుత్వ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేయాలి'
ADB: ప్రజావాణి పోర్టల్‌లో నమోదైన ఫిర్యాదులను నెల రోజుల్లోగా పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల అర్జీలను కలెక్టర్ స్వయంగా స్వీకరించారు. భూ భారతి సమస్యలు, తదితర అంశాలకు సంబంధించి మొత్తం 93 అర్జీలు వచ్చాయని పేర్కొన్నారు.