భార్య, భర్తల మధ్య గొడవ.. భార్య సూసైడ్
KNR: భార్య, భర్తల మధ్య గొడవ కారణంగా భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన జమ్మికుంటలో చోటుచేసుకుంది. వడ్డెర హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన అశ్విని దామర గ్రామానికి చెందిన ఆలకుంట కుమార్‌కి 11 సంవత్సరాల కిందట వివాహం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి భార్య భర్తలకు గొడవ జరుగుతోంది. కుమార్ అశ్వినిని అదనపు కట్నం కింద రూ. 5 లక్షలు కావాలని వేధించినట్లు సమాచారం.