ఇందిరమ్మ గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే
వనపర్తి మండలంలోని గుంటూరు గ్రామంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హాజరయ్యారు. లబ్ధిదారులైన భాగ్యలక్ష్మి, శారద, కావేరి, నిర్మల, మాధవి కుటుంబాలకు ఆయన నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. సొంత ఇంటి కల నెరవేరినందుకు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.