యూరియా సరఫరాపై ఆందోళన వద్దు: మంత్రి

TG: యూరియా సరఫరాపై ఆందోళన వద్దని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు బురద జల్లుతున్నారని మండిపడ్డారు. యూరియా సరఫరాపై కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి విఫలమయ్యారని విమర్శించారు. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి హైదరాబాద్‌కే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు.