క్రీడా శిక్షణ శిబిరాలకు దరఖాస్తుల ఆహ్వానం

ASR: జిల్లాలో మే 1 నుంచి 31వరకు అన్ని విభాగాల్లో వేసవి క్రీడా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాప్రాధి కార సంస్థ అధికారి ఎ.జగన్మోహన్ రావు తెలిపారు. 8 నుంచి 14ఏళ్ల వయస్సుగల బాలబాలికలకు వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు, ఈ నెల 25 లోపు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.