తంగేడులో మాజీ ఎమ్మెల్సీ డీవీఎస్ రాజు హౌస్ అరెస్ట్

తంగేడులో మాజీ ఎమ్మెల్సీ డీవీఎస్ రాజు హౌస్ అరెస్ట్

AKP: మాజీ ఎమ్మెల్సీ, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ వైసీపీ పరిశీలకుడు డీవీ సూర్యనారాయణ రాజును పోలీసులు మంగళవారం ఉదయం కోటవురట్ల(M) తంగేడు స్వగ్రామంలో హౌస్ అరెస్ట్ చేశారు. మంగళవారం అన్నదాత పోరు కార్యక్రమానికి వైసీపీ అధిష్టాన వర్గం పిలుపునిచ్చిన నేపాధ్యంలో ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. శాంతియుతంగా చేసే నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడం తగదన్నారు.