విశాఖ వాణిజ్య పన్నుల డిప్యూటీ కమిషనర్ బాధ్యతలు స్వీకరణ
విశాఖ వాణిజ్య పన్నుల శాఖ 1వ డివిజన్ నూతన డిప్యూటీ కమిషనర్ ఎం.హరీష్ కుమార్, జాయింట్ కమిషనర్‌గా పీ.బీ.వల్లి శనివారం బాధ్యతలు స్వీకరించారు. హరీష్ కుమార్ తిరుపతి నుంచి, వల్లి అనంతపురం పదోన్నతిపై వచ్చారు. వీరికి సిబ్బంది స్వాగతం పలికారు. 2025-26 ఆర్థిక సంవత్సర పన్నుల లక్ష్య సాధన, జీఎస్టీ సంస్కరణలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.